![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -329 లో.. ముకుంద, మురారీల పెళ్లికి ఈ శుక్రవారం మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో ముకుంద, భవాని హ్యాపీగా ఫీల్ అవుతారు. మురారి అయిష్టంగా ఉండి, ఇక నేను వెళ్తానంటూ కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతాడు. మరొకవైపు తన అల్లుడికి వేరొకరితో పెళ్లి అవుతుందని శకుంతల ఏడుస్తూ.. నీ పరిస్థితేంటని కృష్ణతో అనగానే అప్పుడే మురారి అక్కడికి వస్తాడు.
తను ఏడ్వడం చూసిన మురారి.. మీ చిన్నమ్మ ఎందుకు ఏడుస్తుందని కృష్ణని అడుగుతాడు. ఏం లేదని కృష్ణ చెప్తుంది. నా బాధ మీతో చెప్పుకోవడానికి వచ్చానని మురారి అంటాడు. నాకు ముకుందకీ వచ్చే శుక్రవారం పెళ్లి అనగానే.. కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కాసేపటికి ముకుంద వచ్చి. పెద్ద అత్తయ్య పిలుస్తున్నారని మురారిని తీసుకొని వెళ్తుంది. " ఇప్పుడు నేను రాను.. కృష్ణ దగ్గర ఉంటానంటే నేనేం చెయ్యాలి " అని భవాని అనుకుంటు ఉండగా.. అప్పుడే మురారిని తీసుకొని వస్తుంది ముకుంద. అప్పడు మురారి కోపంగా.. ఏంటి నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తున్నావని మురారి అనగానే.. నేనేం అన్నాను. అత్తయ్య తీసుకొని రమ్మన్నారు. తీసుకొని వచ్చానని ముకుంద చెప్తుంది.
మరొక వైపు ముకుంద చేసే పనులకు, పాపం కృష్ణ ఇబ్బంది పడుతుందని శ్రీనివాస్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శ్రీనివాస్ దగ్గరికి కృష్ణ వచ్చి మాట్లాడుతుంది. అంతలోనే శ్రీనివాస్ ఇంటికి ముకుంద, మురారి, భవాని వస్తారు. కృష్ణ కిచెన్ లోనే వాళ్ళకి కన్పించకుండా ఉంటుంది. ఆ తర్వాత మురారి వాటర్ కోసం వెళ్లి అక్కడ ఉన్న కృష్ణని చూసి తనతో మాట్లాడుతుంటాడు. ఇంకా మురారి రావడం లేదని , నేను వెళ్లి చూస్తానంటు భవాని కిచెన్ లొకి వెళ్ళగానే కృష్ణ కన్పిస్తుంది.
కృష్ణని చూసిన భవాని షాక్ అవుతుంది. కావాలనే మురారి ముందు శ్రీనివాస్ కి హెల్ప్ చెయ్యడానికి వచ్చావా? నువ్వు వెళ్ళు మురారి అంటూ మురారిని బయటకు పంపిస్తుంది భవాని. కానీ అక్కడే మురారి ఉంటాడు. అది గమనించిన భవాని యాక్ట్ చేస్తు మాట్లాడుతుంది. మురారి వెళ్ళిపోయాక మాత్రం ఈ పెళ్లి సజావుగా జరగనివ్వవా అంటూ కృష్ణకి భవాని వార్నింగ్ ఇస్తుంది. కృష్ణ తప్పు చేసిందంటే మురారి నమ్మడు. దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. తరువాయి భాగంలో.. ముకుంద, భవాని, మురారి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ మురారికి గతంలో ఎవరో ఒకరు తనకి భోజనం వడ్డించినట్లు గుర్తుకువస్తుంది. అప్పుడే కృష్ణ అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |